(users of Windows 2000 read this page for more information).

Download and update your Internet Explorer components!

పదము (Search Word)

అర్థము లో వెతుకు (search in meaning)
పదము లో కొంత భాగమే సరి చూడు (partial match)

పదము అర్థము

Acrid (n. s.)

వగరు, కారము, వేండ్రము.

Acridity (n. s.)

వగరు, కారము, వేండ్రము, తీక్ష్ణము, చురుకు. the * of the lime powder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.

Acrimonious (adj.)

క్రూరమైన, పరుషమైన, కఠోరమైన. * language కర్ణకఠోరమేన మాటలు. * humours in the body శరీరములో వుండే విష నీరు.

Acrimoniously (adv.)

క్రూరముగా, కఠోరముగా.

Acrimony (n. s.)

క్రూరత, పరుషత, కఠోరత, తీక్ష్ణత.

Across (adv.)

అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెన కట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * the river యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.

Acrostic (n. s.)

ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్క మొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరు అవుతున్నది.

To Act (v. n.)

ఆడుట, ప్రవర్తించుట, నడుచుకొనుట. I will * in conformity to your wishes తమ అభిప్రాయపద్ధతికి నడుచుకొంటాను. he acted as a minister మంత్రిగా ప్రవర్తించినాడు. he acted upon his own authority స్వతంత్రముగా ప్రవర్తించినాడు. when a watch is broken the hands do not * ఘటియారము పగిలితే ముండ్లు తిరగవు. this acted as a purge యిది భేదిమందుగా వుపయోగించినది. this medicine did not * on the fever యీ మందు ఆ జ్వరమును పట్టలేదు. she acted excellentely in this comedy యీ నాట్యములో బహు ఘనముగా ఆడింది. she acted to me as a mother అది నాకు తల్లిమారు తల్లిగా వుండినది. their words acted upon him as a discouragement వాండ్ల మాటలు వాడికి అధైర్యమును చేసింది. he will not act without orders వుత్తరవు లేక వాడు చేయడు, ప్రవర్తించడు. to * for another బదులుగా పనిచూచుట. he acted up to his principles తన యోగ్యతకు అనుగుణ్యముగా నడిచినాడు. he acted up to his orders అతని వుత్తరవు చొప్పున నడుచుకొన్నాడు. the troops acted against them ఆ దండు, వాండ్ల మీద యుద్ధము చేసినది.

To Act (v. a.)

నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషము వేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అది రాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడు తండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality he was an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకు శత్రువు.

Act (n. s.)

క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. a noble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము. an * of parliament or government చట్టము. the * of God or the king దైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. I caught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.

< ముందు పుట | తరువాయి పుట >


  


Copyright 2006 by Srinivas Annam   Terms Of Use | Privacy Statement