| పదము |
అర్థము |
A; the short a () |
అకారము, as in About, Around, Amount, or in the words అవతల, అక్కడ. The broad a, as in Far, Part, half, hard, ఆకారము, as in the words ఆలాగున alaguna, చాలా cala. The articles A or An ; ఇవి Indefinite articles అనిర్డిష్టోసపడములు. a house ఒక యిల్లు. a man ఒక మనిషి ; కొన్ని స్ఠలములలో. A, An వీటికి వొక అనే అర్థము లోపిస్తున్నది, ఏలాగంటే. a house ఇల్లు . an elephant ఏనుగ. 2. A అనే ఉపపదమునకు " కి, కు, " అనే అర్థమవుతున్నది; ఏలాగంటే, he has three hundred a-year వానికి యేడాడికి మున్నూరు వస్తున్నది. thrice a-year సంవత్సరానికి మూడు మాట్లు. twice a-week వారానికి రెండుమాట్లు. twice an hour ఘడియకు రెండుమాట్లు. 3. A అనే ఉపపదమునకు లో -గా- అని అర్థమవుతున్నది. ఏలాగంటే, Asleep నిద్రలో. he is asleep వాడు నిద్రపోతున్నాడు. Athirst దాహముగా. he is athirst వానికి దాహముగా వున్నది. a-row వరసగా. All those pillars are a-row స్తంభములన్ని వరసగా వున్నవి. he came afoot పాదచారిగా వచ్చినాడు, నడిచి వచ్చినాడు. 4. With a participle ; he went a -hunting వేటకు పోయినాడు. they went a-boating జలవిహారమునకు పోయిరి. the cat went a-mousing పిల్లి యెలుకలను పట్టపోయినది. he fell a-laughing నవ్వినాడు. he went a-begging బిచ్చానికి పోయినాడు. 5. how much a yard ? గజమెంత. many a time శానామాట్లు. many a woman శానామంది స్త్రీలు. A. D. or Anno Domini ఖ్రీస్తు పుట్టిన సంవత్సరమునకు సంజ్ఞ. ( ముఖ్యముగా In the year of our Lord 1845 . అని చెప్పుతున్నారు.) A. M. or Anno Mundi ప్రపంచము కలిగిన సంవత్సరము. A. M. or Artium Magister కాలీజులో యిచ్చే వొక పౌరుష నామము. |
Aback, Abaft (adv.) |
వెనక, ఇది సముద్ర భాష. |
To Abalienate (v. a.) |
పరాధీనము చేసుట. |
Abalienation (n. s.) |
పరాధీనము. |
To Abandon (v. a.) |
విడిచిపేట్టుట, పరిత్యాగము చేసుట, వర్జించుట, త్యజించుట, మానుకొనుట. She abandoned herself to grief అని వ్యసనమునకు పాలైనది. he abandoned her దాన్ని చెయి విడిచినాడు. |
Abandoned (adj.) |
విడవబడ్డ, త్యజించబడ్డ, వర్జించిన, చెయి విడవబడ్డ. or helpless దిక్కుమాలిన. or vicious దుర్మార్గమైన, దుష్ట. * to grief వ్యసనాక్రాంతుడైన. * to his lusts మోహపరశుడైన. an * woman భ్రష్టురాలు, చెడ్డది, దుష్టురాలు. |
Abandonment (n. s.) |
విడవడము, పరిత్యాగము. of mind విభ్రమము, పరవశత. |
To Abase (v. a.) |
వంచుట, అణుచుట, అవమానపరచుట, భంగపరచుట. |
Abased (adj.) |
అణిగిన, భంగపడ్డ. |
Abasement (n. s.) |
అవమానము, భంగము. |
|
తరువాయి పుట >
|
|